Protest: అత్త ఇంటి ముందు ధర్నాకు దిగిన కోడలు

మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం కాలనీలో అత్త ఇంటి ముందు కోడలు ధర్నాకు దిగింది.

Update: 2024-04-27 11:15 GMT

న్యూస్ లైన్ డెస్క్: మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం కాలనీలో అత్త ఇంటి ముందు కోడలు ధర్నాకు దిగింది. తన భర్త 4 నెలల క్రితం మృతిచెందడంతో.. అత్త తనను చిత్ర హింసలకు గురిచేస్తోందని కళ్యాణి(30) అనే మహిళ ఆందోళన చేపట్టింది. తనకు సంబంధించిన బంగారం పుస్తెల తాడు, ఇంటి పత్రాలు తను ఇంట్లో లేని సమయంలో కాజేశారని కళ్యాణి వాపోయింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదంటూ.. తన రెండేళ్ల కుమారుడు, కుటుంబసభ్యులతో కలిసి కళ్యాణి ధర్నాకు దిగింది. 

Tags:    

Similar News