KCR: కరెంటు కోతలపై కేసీఆర్ ట్వీట్

రాష్ట్రంలో కరెంటు కోతలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి.

Update: 2024-04-27 10:54 GMT

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కరెంటు కోతలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ట్వీట్ చేశారు. “తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్‌నగర్ (mahabubnagar) ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి (manne srinivas reddy) మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) ఇంట్లో భోజనం చేశాం. భోజనం చేసేటప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యాన్నికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి” అని ఆయన ట్వీటర్ వేధికగా పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరెంట్ కోతలపై ట్వీట్ చేయడంతో ఈ వార్త ఇప్పుడ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇవాళ కేసీఆర్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్రలు చేపట్టి రాష్ట్రంలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని వారిని దైర్యంగా ఉండాలని హామి ఇస్తున్నారు. ఆయన శుక్రవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బస్సు యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News