Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి ఊహించని షాక్

బంగారం కొనుగోలు చేసే వారికి మరోసారి ఊహించని షాక్ తగిలింది. గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Rates) విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ మళ్లీ బంగారం

By :  Sai
Update: 2024-04-27 02:01 GMT

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి మరోసారి ఊహించని షాక్ తగిలింది. గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Rates) విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ మళ్లీ బంగారం ధరలు (Gold Rates) అదే బాట పట్టాయి. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు దాదాపు 20 వేల రూపాయల వరకు బంగారం ధరలు పెరిగాయి. దీంతో తులం బంగారం కొనుగోలు చేయాలంటే జనాలు భయపడిపోతున్నారు.

అంతర్జాతీయ కారణాలవల్ల... బంగారం ధరలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా హైదరాబాద్ మహానగరంలో పెరిగిన బంగారం ధరల (Gold Rates) వివరాల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) పది రూపాయలు పెరిగి 72,720 రూపాయలుగా నమోదు అయింది.

అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 66వేల 660 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు (silver rates) కాస్త పెరిగాయని చెప్పవచ్చు. కిలో వెండి ధర ₹100 పెరిగి 84 వేల 600 రూపాయలుగా నమోదు అయింది.

Tags:    

Similar News