Hanuman Jayanti: ఈ హనుమాన్ జయంతి..ఆర్ధిక కష్టాలకు ఆంజనేయుడే దిక్కు

దేశంలోని హనుమంతుడి( HANUMANTH) ఆలయంలో బజరంగబలి జయంతిని( HANUMAN JAYANTHI) ఘనంగా నిర్వహిస్తున్నారు.

By :  Tejashwini
Update: 2024-04-23 11:03 GMT

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలోని హనుమంతుడి( HANUMANTH) ఆలయంలో బజరంగబలి జయంతిని( HANUMAN JAYANTHI) ఘనంగా నిర్వహిస్తున్నారు. మీరు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే చైత్రపౌర్ణమి చాలా సహాయం చేస్తుంది. తమలపాకు పూజలు చేయించండి. మంగళవారం( TUESDAY) హనుమంతుడి జయంతి రావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే మంగళవారం రామ భక్త హనుమంతుడికి అంకితం చేయబడింది. మంగళవారం నాడు ఆచారాల ప్రకారం బజరంగబలిని పూజించడం ద్వారా అన్ని అడ్డంకుల నుంచి విముక్తి పొంది, కోరుకున్న ఫలితాలను పొందుతారు.

మిఠాయి ( SWEETS) అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. కనుక మంగళవారం సాయంత్రం పూజ సమయంలో హనుమంతుడికి బూందీ సమర్పించండి. ఇలా చేయడం వలన హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. కోరిన కోరికలన్నింటినీ తీరుస్తాడు.

ఆంజనేయస్వామికి తులసి దళాలు తినడానికి ఇష్టపడతాడట. ఎందుకంటే రాములవారికి ఇష్టమైన తులసీ దళాలు లేకుండా హనుమంతుల వారికి కడుపు నిండదు. కాబట్టి ప్రసాదం పెట్టి రెండు తులసీదళాలు వేసి నివేదన ఇవ్వండి. హనుమంతునికి సింధూరం ( SINDHUR) ఇచ్చినా స్వామికి మీ మీద దయ కలిగి మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడతారు.

Tags:    

Similar News