KCR: సోషల్ మీడియాలోకి గులాబీ బాస్

మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచారు.

Update: 2024-04-27 07:30 GMT

న్యూస్ లైన్ డెస్క్: మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్(KCR) సోషల్ మీడియా(Social media)లో ఖాతాలు తెరిచారు. ఇదివరకు సీఎంగా ఉన్న సమయంలో CMO అధికారిక వాట్సాప్ ఛానల్(Whatsapp Channel) ద్వారా పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కేసీఆర్ అందుబాటులో ఉండేవారు. ఇక తాజాగా.. ట్విట్టర్(Twitter), ఇన్‌స్టాగ్రామ్(Instagram)ల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు కేసీఆర్. ఈరోజు ఉదయం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో KCRBRSPresident అనే పేరుతో అకౌంట్‌లు క్రియేట్(Create) చేశారు. దీంతో, కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన గంట వ్యవధిలోనే వేల సంఖ్యలో అభిమానులు ఖాతాలను ఫాలో చేస్తున్నారు. 

Tags:    

Similar News