IPL 2024: ఇవాళ IPL 2024లో డబుల్ ధమాకా మ్యాచ్ లు

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ డబుల్ ధమాకా మ్యాచ్లు జరగనున్నాయి. శనివారం కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహించేందుకు ఐపీఎల్ బృందం సిద్ధమైంది. మొదటి మ్యాచ్

By :  Sai
Update: 2024-04-27 03:30 GMT

IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ డబుల్ ధమాకా మ్యాచ్లు జరగనున్నాయి. శనివారం కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహించేందుకు ఐపీఎల్ బృందం సిద్ధమైంది. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలో ఉన్న అంతర్జాతీయ స్టేడియంలో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.

అలాగే.. రెండవ మ్యాచ్లో... లక్నో సూపర్ జెంట్స్ (Lucknow Super Giants), వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య ఫైట్ ఉండనుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

ఇందులో... లక్నో సూపర్ జెంట్స్ (Lucknow Super Giants), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) రెండు కూడా గట్టి జట్లు. దాదాపు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆప్స్ స్థానాన్ని పదిలం చేసుకుంది. లక్నో సూపర్ జెంట్స్ కూడా ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు చాలా కష్టపడుతోంది. ఇప్పటివరకు వరుసగా మ్యాచ్ లు గెలుచుకుంటూ వస్తున్న లక్నో... ఇవాళ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో కూడా మంచి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. మరి ఇవాల్టి మ్యాచ్లో ఏ జట్లు గెలుస్తాయో చూడాలి.

Tags:    

Similar News