Allu Arjun: జనసేనానికి అల్లు అర్జున్ మద్దతు

జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు.

Allu Arjun: జనసేనానికి అల్లు అర్జున్ మద్దతు
X

న్యూస్ లైన్ డెస్క్: జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, పవన్ కళ్యాణ్‌ ఎన్నికల ప్రయాణంలో తన జీవితాన్ని సేవకే అంకితం చేశారని అన్నారు. ఆయన ఎంచుకున్న మార్గం గురించి తను ఎప్పుడూ గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఓ కుటుంబ సభ్యునిగా, తన ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ పవన్‌పై ఉంటుందని స్పస్టం చేశారు. ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, పవన్‌కు ఇప్పటీకే పలువురు సెలబ్రెటీలు మద్దతు ప్రకటించారు. జబర్దస్‌ టీం, వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్ తేజ్ పవన్‌‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.

Tags:
Next Story
Share it