Amit Sha: బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం

కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా (amit shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ (bjp) అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు (muslim reservations) తొలగిస్తాం అన్నారు. లోక్‌సభ ఎన్నికల (loksabha election) ప్రచారంలో భాగంగా భువనగిరిలో (bhuvangiri) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

Amit Sha: బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం
X

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా (amit shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ (bjp) అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు (muslim reservations) తొలగిస్తాం అన్నారు. లోక్‌సభ ఎన్నికల (loksabha election) ప్రచారంలో భాగంగా భువనగిరిలో (bhuvangiri) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ (telangana) ప్రజలను కాంగ్రెస్ (congress) మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని కాంగ్రెస్ పూర్తిగా చేయలేకపోయిందన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అన్ని పూర్తి చేశామని ప్రచారాలలో చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ (mim) బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని అమిత్ షా ఎద్దవ చేశారు. అయోధ్యలో (ayodya) రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్‌ని (burra narsaiah) గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని అమిషా ప్రకటించారు.”

Tags:
Next Story
Share it