Arvind kejriwal: జైల్ నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం

ఢిల్లీ (delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (cm arvind kejriwal) జైల్ (jail) నుంచి విడుదలైయ్యారు. లిక్కర్ కేసులో ఈడీ ఆయనను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో (thihar jail) ఉంచిన విషయం తెలిసిందే.

Arvind kejriwal: జైల్ నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం
X

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ (delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (cm arvind kejriwal) జైల్ (jail) నుంచి విడుదలైయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఆయనను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో (thihar jail) ఉంచిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పలుమార్లు పిటిషన్ దాఖలు చేసిన బెయిల్ ఇవ్వలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టుని (supreme court) ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన తరఫు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్ట్ ఆయనకు జూన్ 1వ తేదీ వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ని మంజూరు చేసింది. అరెస్టైన 50 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ దొరికింది. తీహార్ జైల్ నుంచి ఆయన బయటకు వచ్చారు. సీఎం 50 రోజుల తర్వాత బయటకు రావడంతో రాష్ట్ర ప్రజలు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపు ఉదయం 11 గంటలకు కన్నాట్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి.. మధ్యాహ్నం 1 గంటలకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:
Next Story
Share it