IPL: ఉప్పల్‌లో బెంగళూరు గ్రాండ్ విక్టరీ.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా గురువారం సాయత్రం జరిగిన ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది.

IPL: ఉప్పల్‌లో బెంగళూరు గ్రాండ్ విక్టరీ.!
X

సన్ రైజర్స్ హైదరాబాద్ కు నిరాశ

హాఫ్ సెంచరీలతో చెలరేగిన విరాట్, పాటిదార్

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా గురువారం సాయత్రం జరిగిన ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రాజత్ పాటిదార్ హాఫ్ సెంచరీలతో రఫ్పాడించారు. మరోవైపు కామెరూన్ గ్రీన్ దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో హైదరాబాద్ పై బెంగళూరు 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్లు మంచి ప్రారంభాన్ని అందించారు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ దూకుడు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇక కోహ్లీ బౌండరీలు, సిక్సర్లు కొడుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి కలిసి స్కోర్ బోర్డుకు 40 రన్స్ జతచేశారు. ఫాఫ్(25), నటరాజన్ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ కాసేపటికే విల్ జాక్స్‌(6)ను మార్కండే బౌల్డ్ చేశాడు. దాంతో ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు కొట్టింది. ఆ తర్వాత క్రీజులో రజాత్ పాటిదార్ దిగాడు. కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. మరో ఎండ్ కింగ్ కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ జోరుమీద కొనసాగింది. మరోవైపు పాటిదార్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లోనే బౌండరీలు, సిక్సర్లు బాదుతూ పటిదార్(20 బంతుల్లో 50 రన్స్ 2 ఫొర్లు, 5 సిక్సర్లు) సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరు కలిసి ఆర్సీబీ స్కోర్ బోర్డుకు 100 పరుగులు జోడించారు. అయితే పాటిదార్(50), జ‌య‌దేవ్ ఉనాద్కాట్ బౌలింగ్ భారీ ష్టాక్‌కు ప్రయత్నంచి అబ్దుల్ సమ్మద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. విరాట్ తో కలిసి మంచి భగస్వామ్యని నెలకొల్పాడు. కానీ ఉనాద్కాట్ ఓవర్‌లో కోహ్లీ(51) పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆర్సీబీ 4 వికెట్ల నష్టపోయి 150 రన్స్ స్కోర్ చేసింది. ఈ సమయంలో దీనేష్ కార్లీక్(11) బ్యాటింగ్ కు దిగాడు. అయితే పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో విఫలమయ్యాడు. కామెరూన్ గ్రీన్ ఆఖరి వరకు ఉండి హార్డ్ హిటింగ్ బ్యాటింగ్ చేశాడు. గ్రీన్(36) సిక్సర్లు బాదుతూ బెంగళూరుకు భారీ టోటాల్ అందించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ బౌలర్లు జ‌య‌దేవ్ ఉనాద్కాట్ మూడు వికెట్లు పడగొట్టాగా.. నటరాజన్ రెండు, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశారు.

260 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) మొదటి ఓవర్‌లోనే విల్ జాక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత ఐడెన్ మార్‌క్రమ్ క్రీజులో దిగాడు. అభిషేక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ యాష్ దాయల్ బౌలింగ్‌లో అభిషేక్(31) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మార్‌క్రమ్(7), హెన్రీచ్ క్లాసన్(7), నితిష్ కుమార్(13) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 5 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. మరోవైపు షాహ్‌బాజ్ అహ్మద్ వికెట్ల పడుతున్న ఆర్సీబీ బౌలర్లను ధాటిగా ఎదురుకుంటూ అబ్దుల్ సమ్మద్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. అయితే సమ్మద్‌(10), కరణ్ శర్మ ఓవర్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ వచ్చాడు. దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. షాహ్‌బాజ్, కమిన్స్ లు ఇద్దరు స్కోర్ బోర్డుకు 40 రన్స్ జోడించారు. కాగా, కామెరూన్ గ్రీన్ తన ఓవర్ లో కమిన్స్(31) పెవిలియన్ కు పంపాడు. దీంతో హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. ఇక షాహ్‌బాజ్(40 నాటౌట్ ) చివరి వరకు పోరాడాడు. కానీ ఆర్సీబీకి విజయం వరించింది. దీంతో బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ పై 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లు కరణ్ శర్మ, కామెరూన్ గ్రీన్, స్వప్నిల్ సింగ్ చేరు రెండు వికెట్లు తీయగా.. వీల్ జక్స్, యాష్ దయాల్ చెరో వికెట్ తీశారు.

Tags:
Next Story
Share it