Rahul Gandhi: రాజ్యాంగాన్ని రద్దుచేసే కుట్రలో బీజేపీ

ఒక వర్గం రాజ్యాంగాన్ని రక్షించాలని అంటుంటే.. మరో సమూహం రాజ్యాంగం అవసరం లేదు రద్దు చేస్తామని అంటోందని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: రాజ్యాంగాన్ని రద్దుచేసే కుట్రలో బీజేపీ
X

న్యూస్ లైన్ డెస్క్: రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ(BJP) కుట్ర చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హెచ్చరించారు. నర్సాపూర్‌(Narsapur)లో ఈరోజు కాంగ్రెస్‌(Congress) జనజాతర సభ నిర్వహించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, CM రేవంత్‌ రెడ్డి(Revanth reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం దేశంలో రెండు సమూహాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఒక వర్గం రాజ్యాంగాన్ని రక్షించాలని అంటుంటే.. మరో సమూహం రాజ్యాంగం అవసరం లేదు, రద్దు చేస్తామని అంటోందని వ్యాఖ్యానించారు.

బీజేపీ కుట్రల పట్ల దళితులు, BC వర్గానికి చెందిన వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్య, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయని తెలిపారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. దీని ద్వారా పేదలకు న్యాయం జారుతుందని వెల్లడించారు. కులగణన ద్వారా ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలో నెలకు రూ.8500 అంటే.. ఏడాదికి రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి తెలంగాణతో పాటు ఇండియాలో కూడా పేదరికాన్ని పూర్తిగా నిర్ములిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాలనలో అదానీ, అంబానీలు మాత్రమే బాగుపడ్డారని వ్యాఖ్యానించారు. అదానీ కోసమే నోట్ల రద్దు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Tags:
Next Story
Share it