Boy: స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి

ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

Boy: స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ మొయినాబాద్(Moinabad)లోని ఓ ప్రైవేట్ స్కూల్(Private school)లో విషాదం చోటుచేసుకుంది. సుజాత స్కూల్‌లోని స్విమ్మింగ్ పూల్‌(Swimming pool)లో పడిపోవడంతో ఒకటో తరగతి విద్యార్థి శౌర్య(Sourya) మృతిచెందాడు. సమ్మర్‌ క్యాంపు(Summer camp)లో భాగంగా ఫ్రీగా స్విమ్మింగ్ నేర్పిస్తుండడంతో బాలుడిని పంపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు విచారించగా జరిగిన ఘోరం బయటపడింది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని శౌర్య బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో స్కూల్ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది.

Tags:
Next Story
Share it