KTR: కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవద్దు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

KTR: కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవద్దు
X

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్‌కి 5 నెలల కింద కేసీఆర్ వచ్చారని, కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దని అప్పుడు కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసాలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడారు. ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన కరెంట్ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయాని అన్నారు. రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారని 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2,500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు అని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా అమలు కాలేదని, ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముదాని అన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, పదేళ్ల క్రితం ఎన్నో డైలాగులు చెప్పి బీజేపీ వాళ్లు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అనుకునేటోళ్లకు 13న ఆత్రం సక్కు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నమ్మించి మోసం చేసే నరేంద్ర మోడీ పదేళ్లలో దేశానికి, ఆదిలాబాద్‌కు ప్రధాని ఒక్క పనిచేయలేదన్నారు. ఆదిలాబాద్‌లో సీసీఐను ఓపెన్ చేయలేదని, బీజేపీ ఎంపీ ముధోల్ తాలుకాలో ఒక్కటంటే ఒక్క పని చేశారా అని ప్రశ్నించారు. 2014 మోడీ రూ. 15 లక్షలు అందరి అకౌంట్లో వేస్తా, రైతుల ఆదాయం డబుల్, అందరికీ ఇళ్లు, ఇంటింటికి నల్లా అని చాలా హామీలు చెప్పాడు. కానీ చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. పదేళ్లు ప్రధానిగా పని చేసిన మోడీ ఒక్క బడి కట్టలే, గుడి కట్టలే, కొత్త కాలేజ్, ఓ ప్రాజెక్ట్ ఆదిలాబాద్‌ ఇవ్వలేదనన్నారు. బీజేపీకీ ఈ పదేళ్లలో చేసిన పనులు చెప్పుకునేందుకు లేక, అందుకే దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మోడీ గుజరాత్‌కు వేల కోట్లు ఇస్తాడు, కానీ తెలంగాణకు బుడ్డ పైసా కూడా ఇవ్వడాని తెలిపారు. దేవుడి పేరు చెప్పి అదానీకి, అంబానీకి దోచిపెట్టే సన్నాసులకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it