Chillakuru: చిలుకూరులో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు

వివాహ ప్రాప్తి కోసం రేపు కల్యాణోత్సవానికి ఎవరూ రావొద్దని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు.

Chillakuru: చిలుకూరులో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు
X

న్యూస్ లైన్ డెస్క్: చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukuru balaji temple)లో శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ప్రసాదం తీసుకుంటే యేళ్ల తరబడి సంతాన భాగ్యం లేని వారికి కూడా పిల్లలు పుడతారని నమ్ముతారు. ప్రతి ఏడాది ఈ ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో భక్తుల వస్తారు. కాగా, నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్(Hyderabad) నుండే కాకుండా.. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ప్రజలు తరలి వచ్చారు. దీంతో వాహనల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చిలుకూరు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం(Traffic jam) ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుండి ప్రసాదం కోసం వచ్చిన వారే కాకుండా స్థానికంగా ఉంటూ స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో నిన్న మధ్యాహ్నం అయ్యేసరికే గరుడ ప్రసాద పంపిణీని ముగించేశారు.

గరుడ ప్రసాదం పంపిణీ లాగానే, ప్రతి యేటా వివాహ ప్రాప్తి కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే, ఈ ఆదివారం జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశారు. వివాహ ప్రాప్తి కోసం రేపు కల్యాణోత్సవానికి ఎవరూ రావొద్దని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్(Rangarajan) స్పష్టం చేశారు. పెళ్లి కావాల్సిన వాళ్లు తమ ఇళ్లల్లో నుంచే దేవుడ్ని ప్రార్థించుకోవాలని సూచించారు. నిన్న గరుడ ప్రసాదం పంపిణీ సమయంలో చోటుచేసుకున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రేపు సాయంత్రం జరిగే కల్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు.

Tags:
Next Story
Share it