Delhi: సీఎంని అరెస్ట్ చేయించి బీజేపీ తప్పు చేసింది

ఢిల్లీ (delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (cm arvind kejriwal) కు సుప్రీంకోర్టు (supreme court) మధ్యంతర బెయిల్‌ (bail) మంజురు చేసింది. ఆయనకు బెయిల్ లభించడంతో ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ (saurabh bharadwaj) స్పదించారు.

Delhi: సీఎంని అరెస్ట్ చేయించి బీజేపీ తప్పు చేసింది
X

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ (delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (cm arvind kejriwal) కు సుప్రీంకోర్టు (supreme court) మధ్యంతర బెయిల్‌ (bail) మంజురు చేసింది. ఆయనకు బెయిల్ లభించడంతో ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ (saurabh bharadwaj) స్పదించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఆప్ పార్టీ కార్యకర్తలే కాదు, దేశంలోని లక్షలాది మంది ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీతో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయించి మొదటి తప్పు చేసింది. ఆయనను జైల్లో పెట్టిడంతో దేశంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎన్నికల వేళ ఆయనను జైల్లో ఉంచడంతో బీజేపీకి తీవ్రమైన నష్టం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేయలేదు కాబట్టే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని ఆయన అన్నారు.

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ అక్రమంగా కేసు పెట్టి.. ఆయన తప్పు చేశాడని కోర్టులో ప్రూవ్ చేయలేకపోయిందని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ దేశ ప్రజలకు చేసిందేమి లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్య నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించి బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు.”

Tags:
Next Story
Share it