Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు (loksabha elections) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి (congress party) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండాల్సిన సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఢిల్లీ (delhi) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ (arvinder singh lovely) రాజీనామా (resigned) చేశారు.

Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ రాజీనామా
X

న్యూస్ లైన్ డెస్క్: లోక్‌సభ ఎన్నికలు (loksabha elections) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి (congress party) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండాల్సిన సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఢిల్లీ (delhi) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ (arvinder singh lovely) రాజీనామా (resigned) చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పై తప్పుడు, దుర్మార్గపు అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతోనే పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.”

ఆప్‌తో పొత్తు విషయంపై ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేంచినప్పటికీ అధిష్టానం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని అరవింద్ ఆరోపించారు. పొత్తులో భాగంగా టికెట్ల పంపిణీపై అరవింద్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలుండగా అందులో ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

Tags:
Next Story
Share it