Delhi: ఆ పార్టీ పాటపై నిషేదం విధించిన ఈసీ

ఎన్నికలు (elections) సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు ప్రచారాలలో (compaign) బిజీ బిజీగా ఉన్నాయి. ప్రచారం మొదలుపెట్టాలంటే ఆ పార్టీకి సంబంధించిన పాటలు కచ్చితంగా ఉండాల్సిందే.

Delhi: ఆ పార్టీ పాటపై నిషేదం విధించిన ఈసీ
X

న్యూస్ లైన్ డెస్క్: ఎన్నికలు (elections) సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు ప్రచారాలలో (compaign) బిజీ బిజీగా ఉన్నాయి. ప్రచారం మొదలుపెట్టాలంటే ఆ పార్టీకి సంబంధించిన పాటలు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ పాటలు ఆ పార్టీ చేసిన పనులతో మొదలై వ్యతిరేక పార్టీ నాయకులను దూషించడంతో ముగుస్తాయి. అలాంటి ఓ పార్టీ పాటపై ఈసీ (ec) నిషేదం విధించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో (delhi) చోటుచేసుకుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ (aap) ఎన్నికల కోసం రూపొందించిన పాటపై ఈసీ నిషేదం విధించింది. దీనిపై ఆ పార్టీ మంత్రి ఆతిశీ (atishi) స్పందించింది. ఒక ప్రచార పాటను నిషేధించడం ఇదే తొలిసారి కావొచ్చని ఆమె పేర్కొంది. ఆ పాటలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్నీలను కించపరిచేలా రిలిక్స్ ఉన్నాయని ఈసీ చెప్పినట్లు ఆమె తెలిపింది. అయితే ఆ పాటలో బీజేపీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కూడా ఉల్లఘించలేదని ఆప్ మంత్రి ఆతిశీ వెల్లడించారు.

Tags:
Next Story
Share it