MLC Nomination : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్లు
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగిసింది.
న్యూస్ లైన్, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగిసింది. మే 2నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియ 9వ తేదీ మధ్యాహ్నం 4గంటలతో ముగిసింది. ఈ బరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలతో పాటు టీడీపీ, ధర్మసమాజ్ పార్టీ నుంచి కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం దాఖలైన నామినేషన్ల వివరాలను మరికాసేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. శుక్రవారం నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. మే 13వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Tags:
Next Story