harassment: లైంగిక వేధింపుల కేసులో HD రేవణ్ణ అరెస్ట్

బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవణ్ణను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

harassment: లైంగిక వేధింపుల కేసులో HD రేవణ్ణ అరెస్ట్
X

న్యూస్ లైన్ డెస్క్: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ కుమారుడు రేవణ్ణ(Revanna) అరెస్ట్ అయ్యారు.దేవెగౌడ(Devegouda) నివాసంలో బెంగళూరు(Bengaluru) పోలీసులు ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో పని చేస్తున్న మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా.. ఆమెను కిడ్నాప్(Kidnap) చేశారని ఆయనపై ఇప్పటికే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కాగా, బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవణ్ణను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

Tags:
Next Story
Share it