Heat stroke: వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత

వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో (rangareddy district) చోటుచేసుకుంది.

Heat stroke: వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత
X

న్యూస్ లైన్ డెస్క్: వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో (rangareddy district) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచాల మండలం (manchal mandal) పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలోని (chithapur village) చెరువులో (river) వడదెబ్బకు (heat stroke) రెండు టన్నుల చేపలు (fishes) మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు (fisheries) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను అదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. అత్యధికంగా 46.6, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని పలు జిల్లాలో నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 16 మందికి పైగా మరణించినట్లు సమాచారం.

…………………….

Tags:
Next Story
Share it