Hyderabad: బార్‌లో పాడు పని.. అమ్మాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల బార్ అండ్ రెస్టారెంట్లపై (bar & restaurant) టాస్క్‌ఫోర్స్ పోలీసులు (task force police) దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ బార్‌లో 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లను అధికారులు అరెస్ట్ చేశారు.

Hyderabad: బార్‌లో పాడు పని.. అమ్మాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల బార్ అండ్ రెస్టారెంట్లపై (bar & restaurant) టాస్క్‌ఫోర్స్ పోలీసులు (task force police) దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ బార్‌లో 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లను అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని సికింద్రాబాద్‌ (secunderabad) ఊర్వశి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై (urvasi bar & restaurant) దాడులు నిర్వహించారు. ఆ బార్‌లో యాజమాన్యం అమ్మాలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు యాజమాన్యం అమ్మాయిల ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించి నృత్యాలను చేయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దాడులు నిర్వహించిన అధికారులు ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై పలు కేసులు నమోదు చేశారు. ఆ బార్‌ లైసెన్స్‌ను రద్దు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:
Next Story
Share it