Hyderabad: బ్యూటీ క్లీనిక్‌లపై అధికారుల దాడులు

హైదరాబాద్‌లో (Hyderabad) పలు బ్యూటీ క్లీనిక్‌లపై (beauty clinics) వైద్యులు బృందం దాడులు చేశారు.

Hyderabad: బ్యూటీ క్లీనిక్‌లపై అధికారుల దాడులు
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad) పలు బ్యూటీ క్లీనిక్‌లపై (beauty clinics) వైద్యులు బృందం దాడులు చేశారు. నగరంలోని రాయదుర్గం (rayadurgam) దీప్తి (deepthi) పర్మినెంట్ మేకప్ అండ్ కాస్మోటిక్ క్లీనిక్, మాదాపూర్‌లోని (madapur) వీ-స్పార్క్ (v-spark) వెల్‌నెస్ క్లీనిక్‌లపై రంగారెడ్డి జిల్లా (rangareddy district) డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో వైద్యుల బృందం దాడులు నిర్వహించింది. నగరంలో చాలా చోట్ల ప్రభుత్వ అనుమతి (లైసెన్స్ )లేకుండా, అర్హులైన డెర్మటాలజిస్టు లేకుండా స్కిన్ ట్రీట్ మెంట్ లాంటివి చేస్తున్నట్లుగా సమాచారం అందడంతో దాడుల చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా, డ్రగ్స్ లైసెన్స్ లేకుండా బ్యూటీ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నారని వైద్య బృందం గుర్తించింది. దీప్తి పర్మినెంట్ మేకప్ అండ్ కాస్మోటిక్ క్లీనిక్, మాదాపూర్‌లోని వీ -స్పార్క్ వెల్‌నెస్ క్లీనిక్‌లకు రంగారెడ్డి DMHO వెంకటేశ్వర్ (venkateshwar) నోటీసులు జారీ చేశారు.

Tags:
Next Story
Share it