Karimnagar: చల్లదనం కోసం బంక్ యజమాని వినూత్న ఆలోచన

చల్లదనం కోసం ఓ పెట్రోల్ బంకు (petrol bunk) యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తన బంక్‌కు వచ్చే కస్టమర్స్ కోసం చుట్టూ వాటర్ మిస్ట్ ఫాగ్ సిస్టంను (water mist fog system) ఏర్పాటు చేశారు. ఈ సన్నివేశం కరీంనగర్ జిల్లాలో (karimnagar district) వెలుగుచూసింది.

Karimnagar: చల్లదనం కోసం బంక్ యజమాని వినూత్న ఆలోచన
X

న్యూస్ లైన్ డెస్క్: చల్లదనం కోసం ఓ పెట్రోల్ బంకు (petrol bunk) యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తన బంక్‌కు వచ్చే కస్టమర్స్ కోసం చుట్టూ వాటర్ మిస్ట్ ఫాగ్ సిస్టంను (water mist fog system) ఏర్పాటు చేశారు. ఈ సన్నివేశం కరీంనగర్ జిల్లాలో (karimnagar district) వెలుగుచూసింది. జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ (satavahana university) రోడ్డుమార్గంలోని ఓ పెట్రోల్ బంకులో యజమాని బంకు చుట్టూ వాటర్ మిస్ట్ ఫాగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. దీంతో పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తున్న కస్టమర్లుపై చల్లని పొగమంచు పడుతుంటే.. ఎండ నుంచి ఉపశమనం పొందుతారని బంక్ యజమాని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరింది. దీంతో ప్రజలు ఎండకు బయటకు రావడానికే బయపడుతున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో (nalgonda district) 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ (meteorology department) వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్లు తీవ్ర వడ గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండలకు ఎక్కువగా బయటకు రావొద్దని, తగని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Tags:
Next Story
Share it