Madya Pradesh: అసహజ శృంగారం ఆ సెక్షన్ కిందకు రాదు!

మధ్యప్రదేశ్ (madyapradesh) హైకోర్టు (highcourt) సంచలన తీర్పు వెల్లడించింది. భర్త భార్యతో అసహజ లైంగిక శృంగారానికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా పరిగణించలేమని కోర్ట్ తేల్చి చెప్పింది.

Madya Pradesh: అసహజ శృంగారం ఆ సెక్షన్ కిందకు రాదు!
X

న్యూస్ లైన్ డెస్క్: మధ్యప్రదేశ్ (madyapradesh) హైకోర్టు (highcourt) సంచలన తీర్పు వెల్లడించింది. భర్త భార్యతో అసహజ లైంగిక శృంగారానికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా పరిగణించలేమని కోర్ట్ తేల్చి చెప్పింది. 2019లో ఓ మహిళ తన వివాహం అయిన తర్వాత రెండవసారి ఇంటికి వచ్చాక తన భర్త త‌న‌తో అనేకసార్లు అస‌హ‌జ శృంగారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు నమోదుచేశారు. దీంతో అతడు ఆ కేసుని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు.

తాజాగా ఆ కేసుపై మధ్యప్రదేశ్ హైకోర్ట్ తీర్పు వెల్లడించింది. ఒక భర్త భార్యతో అసహజ శృంగారానికి పాల్పడితే.. భారత చట్టాల ప్రకారం ఆకేసు ఐపీసీ సెక్ష‌న్ 377 కిందకు రాదని స్పష్టం చేసింది. అది ఆమె అసమ్మతి అసంబద్దం అవుతుంది కాబట్టి, ఓ వ్యక్తి తన భార్యతో అసహజ శృంగారంలో నిమగ్నమవ్వడం ఆత్యాచారం కిందికి రాదని సింగిల్ జడ్జి జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లువాలియా వెల్లడించారు. ఈ కేసులో న్యాయపరమైనా వేర్పాటు కారణంగా విడివిడిగా జీవిస్తున్న సమయంలో భార్యతో లైంగిక చర్యలకు పాల్పడితే అది అత్యాచారం కింద కేసు నమోదు చేసిన సమయంలో మాత్రమే సెక్షన్ 376B కింద మినహాయింపు ఇవ్వబడుతుందని, లేని క్రమంలో అది అత్యాచారం కిందకి రాదని కోర్ట్ తీర్పునిచ్చింది. దీనిపై మ‌రింత సంప్ర‌దింపులు అవ‌స‌రం లేద‌ని, పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది.

Tags:
Next Story
Share it