MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు
X

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని (delhi) రౌస్ అవెన్యూ కోర్టు (rouse avenue court) ఆమె జుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో అరెస్టైన ఆమె కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఆమెను అధికారులు కోర్టులో హాజరుపర్చగా కస్టడీని మరో వారం రోజులు పెంచుతూ కోర్టు తీర్పిచ్చింది. కవిత ఈనెల 14వ తేదీ వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు.

మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో కవిత పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు వాయిదా వేసుకుంటూ వచ్చింది. సోమవారం తీర్పులో భాగంగా బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో కావాలనే తనను ఇరికించారని కవిత ఆరోపించారు.

Tags:
Next Story
Share it