Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు

ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (mohan bhagwath) విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకం కాదన్నారు. ఆర్ఎస్ఎస్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు
X

న్యూస్ లైన్ డెస్క్: ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (mohan bhagwath) విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకం కాదన్నారు. ఆర్ఎస్ఎస్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఓ వీడియో సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతుంది. అది పూర్తిగా అవాస్తమని తోసిపుచ్చారు. కొంతమంది నాయకులు వివాదం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. బలహీన వర్గాలకు కల్పించిన ఈ వెసులుబాటు సమాజంలో అవసరం ఉన్నంతకాలం కొనసాగించాల్సిందేనని భాగవత్ తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు. కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు తయారుచేసి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారంలో పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వీడియోలతో సమాజంలో వివిధ వర్గాల మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని ఈ సందర్భంగా యువతకు హితవు పలికారు.

Tags:
Next Story
Share it