Navneet Kaur: బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్‌ కౌర్‌పై కేసు

బీజేపీ (bjp) ఎంపీ అభ్యర్థి నవనీత్‌ కౌర్‌పై (navneet kaur) కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల (loksabha elections) ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్ (Hyderabad) బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత (madhavi latha)కు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.

Navneet Kaur: బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్‌ కౌర్‌పై కేసు
X

న్యూస్ లైన్ డెస్క్: బీజేపీ (bjp) ఎంపీ అభ్యర్థి నవనీత్‌ కౌర్‌పై (navneet kaur) కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల (loksabha elections) ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్ (Hyderabad) బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత (madhavi latha)కు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..“కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్తాన్‌కు వేసినట్టే అన్నారు. హైదరాబాద్ మరో పాకిస్థాన్ కావొద్దంటే మాధవీలతకు ఓటు వేసి గెలిపించాలని ఆమె వ్యాఖ్యనించారు.”

అంతేకాదు గతంలో 15 నిమిషాల్లో తరమికొడతామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ (akbaruddin owaisi) చేసిన వ్యాఖ్యలకు నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు కాదు కేవలం 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని ఒవైసీకి ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ పీఎస్‌లో (shadnagar ps) ఆమెపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది.

Tags:
Next Story
Share it