Nizamabad: చిన్నారిపై వీధి కుక్క దాడి.. వీడియో ఇదిగో

నిజామాబాద్ (nizamabad) జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న ఓ చిన్నారిపై వీధి కుక్క (street dog) దాడి చేసింది.

Nizamabad: చిన్నారిపై వీధి కుక్క దాడి.. వీడియో ఇదిగో
X

న్యూస్ లైన్ డెస్క్: నిజామాబాద్ (nizamabad) జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న ఓ చిన్నారిపై వీధి కుక్క (street dog) దాడి చేసింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని డిచ్‌పల్లి మండలం (dichpally) గన్పూర్ గ్రామంలో (ganpur village) రోడ్డుపై నుంచి ఇద్దరు చిన్నారులు నడుచుకుంటూ వెళ్తుంటే అందులో ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఆ చిన్నారి కిందపడ గానీ వదలకుండా ఆ కుక్క కరిచింది. భయంతో ఇంకో చిన్నారి పరుగులు తీసింది. అది గమనించిన ఆ చిన్నారి తల్లి వచ్చి కర్రతో కుక్కను తరిమికొట్టింది. వెంటనే ఆ చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయలతో ఆ చిన్నారి బయటపడ్డినట్లు స్థానికులు తెలిపారు.

Tags:
Next Story
Share it