KTR: రైతుల ఆదాయం కాదు.. కష్టాలు రెట్టింపయ్యాయి

వేములవాడలో BRS పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు కరీంనగర్ BRS ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా హాజరయ్యారు.

KTR: రైతుల ఆదాయం కాదు.. కష్టాలు రెట్టింపయ్యాయి
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) అన్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆదాయం కాదు, కష్టాలు రెట్టింపయ్యాయని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వేములవాడ(Vemulawada)లో BRS పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు కరీంనగర్ BRS ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. 400 ఏ,ఎంపీ స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారని తెలిపారు. రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారని గుర్తుచేశారు. ఇటువంటి బీజేపీ అరాచకాలను అడ్డుకోవడం కేవలం BRS పార్టీకే సాధ్యమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రధాన మంత్రి మోడీ మోసం చేశారని అన్నారు. ఇప్పుడేమో, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పడు సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

Tags:
Next Story
Share it