Pinaki Chandra Ghose: ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాం

కాలేశ్వరం ప్రాజెక్టుకు (kaleshwaram project) సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘెష్ (Pinaki Chandra Ghose) తెలిపారు.

Pinaki Chandra Ghose: ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాం
X

న్యూస్ లైన్ డెస్క్: కాలేశ్వరం ప్రాజెక్టుకు (kaleshwaram project) సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘెష్ (Pinaki Chandra Ghose) తెలిపారు. బీఆర్ఎకే భవన్‌లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్‌లో న్యాయ విచారణను ఆయన ప్రారంభించారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రజలు కూడా తమ ఫిర్యాదులను, నివేదనలను సీల్డ్ కవర్లో విచారణ కమిషన్‌కు అందచేయవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు హైదరాబాద్లోని (Hyderabad) బీఆర్‌కే భవన్‌లో (brk bhavan) ఉన్న 8వ అంతస్తులోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా సమర్పించే అవకాశం అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ ప్రమాణ పూర్వక అఫీడవిట్లను నోటరీ ద్వారా సాక్షాలను జతపరిచి సమర్పించాలని జస్టిస్ చంద్రఘెష్ పేర్కొన్నారు. మే 31 వరకు అఫీడవిట్లు సమర్పించేందుకు అవకాశం కల్పించమన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహణ నాణ్యత, నిర్మాణపరమైన లోపాలను, బాధ్యులను గుర్తించడం, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై కమిషన్ విచారణ చేయనున్నట్లు జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు.

Tags:
Next Story
Share it