IPL: జానీ బెయిర్‌ స్ట్రా క్లాస్ సెంచరీ.. పంజాబ్ విజయం.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మెగా టోర్నీలో భాగంగా శనివారం సాయత్రం జరిగిన కోల్‌కత్త నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది

IPL: జానీ బెయిర్‌ స్ట్రా క్లాస్ సెంచరీ.. పంజాబ్ విజయం.!
X

బెయిర్‌ స్ట్రా స్టోల్ ది షో..!

ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ల వర్షం

కేకేఆర్ ను చిత్తుగా ఓడించిన పంజాబ్

శశాంక్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్

హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రబ్ సిమ్రాన్

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మెగా టోర్నీలో భాగంగా శనివారం సాయత్రం జరిగిన కోల్‌కత్త నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్‌ స్టొ సెంచరీ తో చెలరేగాడు. ఇక ప్రబ్ సిమ్రాన్, శశాంక్ సింగ్ ఇద్దరు కేకేఆర్ బౌలర్లుకు చుక్కలు చూపించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కత్త జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్‌ని అందించారు. ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ ఇద్దరు కలిసి దూకుడు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరోపవైపు నునీల్ నరైన్ పంజాబ్ బౌలర్లను చితక్కొడుతూ ఊచకోత చూపించాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ నరైన్ ( 32 బంతుల్లో 71 పరుగులు 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సహాయంతో అర్థ శతకం చేశాడు. ఇక వీరిద్ద‌రి జోరుతో కేకేఆర్ స్కోర్ బోర్డు ప‌రుగులు తీసింది. మరో ఎండ్‌లో ఫిలిప్ సాల్ట్ బౌండ‌రీలు, సిక్సర్ల మోత మోగించాడు. దీంతో ఫిలిప్ సాల్ట్ (37 బంతుల్లో 75 రన్స్ 6 ఫోర్లు, 6 సిక్సర్లు)తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి కలిసి స్కోర్ బోర్డుకు 130 రన్స్ జతచేశారు. అయితే నరైన్(71), రాహుల్ చాహర్ ఓవర్‌లో జానీ బెయిర్ స్టొకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే సాల్ట్‌(75) కూడా కెప్టెన్ సామ్ కరెన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు పంపాడు. దీంతో కేకేఆర్ 2 వికెట్ల కోల్పోయి 140 రన్స్ కొట్టింది. తర్వాత క్రీజులో వెంకటెష్ అయ్యర్, అండ్రీ రస్సెల్ దిగారు. ఇద్దకు కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ ఇద్దకు 50 పరుగుల భగస్వామ్యని నెలకోల్పారు. రస్సెల్(240, అర్షదీప్ ఓవర్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగాడు. వెంకటెష్ అయ్యర్‌తో కలిసి అయ్యర్ దూకుడుగా ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వెంకటెష్ అయ్యర్(39) చివరి వరకు ఉంది. కేకేఆర్‌కు భారీ స్కోర్‌ అందించాడు. దీంతో కోల్‌కత్త నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు ఆర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాగా.. హర్షల్ పటెల్, సామ్ కరెన్, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు.

262 కొండంత లక్ష్యాని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్ కింగ్స్‌ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ప్రబ్ సిమ్రాన్, జానీ బెయిర్‌ స్టొ ఇద్దరు కలిసి కేకేఆర్ బౌలర్లను దచికొట్టారు. మరోవైపు సిమ్రాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ కోల్‌కత్త బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ప్రబ్ సిమ్రాన్(20 బంతుల్లో 54 రన్స్ 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మరో ఎండ్ లో జానీ బెయిర్‌ స్టొ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈడెన్ గార్డన్స్ లో సిక్సర్ల మోత మోగించాడు. దీంతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి పంజాబ్ స్కోర్ బోర్డుకు 130 పరుగులు జోడించారు. అయితే సిమ్రాన్, అండ్రీ రస్సెల్ ఓవర్ లో రనౌట్ అయ్యాడు. దీంతో క్రీజులో రిలీ రోసవు దిగాడు. బెయిర్‌ స్ట్రా తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ సునీల్ నరైన్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు శశాంక్ సింగ్ వచ్చాడు. ఇక బెయిర్‌ స్ట్రా కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ( 48 బంతుల్లో 108 పరుగులు 8 ఫోర్లు, 9 సిక్సర్లు )తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో ఐపీఎల్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు. శశాంక్ సింగ్( 20 బంతుల్లో 54 రన్స్ 2 ఫోర్లు, 8 సిక్సర్లు )సిక్సర్ల ఈడెన్ గార్డెన్స్ లో వర్షం కురిపించాడు. కాగా, అర్థం సెంచరీ నమోదు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్, నైట్ రైడర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.

Tags:
Next Story
Share it