Rahul Gandhi: రిజర్వేషన్లకు ప్రధాని మోడీ వ్యతిరేకం

ప్రధాని నరేంద్ర మోడీపై (pm narendra modi) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో (loksabha election compaign) భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (adilabad) నిర్మల్‌లో (nirmal) నిర్వహిచింన బహిరంగ సభలో పాల్గొన్నారు.

Rahul Gandhi: రిజర్వేషన్లకు ప్రధాని మోడీ వ్యతిరేకం
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై (pm narendra modi) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో (loksabha election compaign) భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (adilabad) నిర్మల్‌లో (nirmal) నిర్వహిచింన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రిజర్వేషన్లకు ప్రధాని మోడీ వ్యతిరేకం అని వ్యాఖ్యనించారు. దేశ యువతను, ప్రజలను మోడీ మోసం చేశారని విమర్శించారు. దేశంలో కొత్త ఉద్యోగాలు సృష్టించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ పాలనలో రైతులు కష్టాలని ప్రభుత్వం పట్టించికోలేదన్నారు. మోడీ గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే ప్రధానిగ పాలన చేశారని.. దేశ సంపదను కొంతమంది పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టారని ఆయన మండిపడ్డారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు రిజర్వేషన్లను పూర్తిగా రద్దుచేస్తామని ప్రచారం చేస్తున్నారని.. పేదల హక్కులను హరించి, ధనికులకు మేలు చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటువ్యక్తులకు అమ్ముకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్లు తొలగించడమేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు.”

Tags:
Next Story
Share it