Rains: దంచికొడుతున్న వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలో అక్కల వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మేడ్చల్, నల్లగొండ, జనగామలో చిరుజల్లులు కురుస్తున్నాయి.

Rains: దంచికొడుతున్న వర్షాలు
X

న్యూస్ లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలో అక్కల వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మేడ్చల్, నల్లగొండ, జనగామలో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతాపూర్, కూకట్ పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్‌లో బలమైన ఈదురుగాలులుతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. రోడ్ల మీద వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంది.

ఏపీలోని అల్లూరి జిల్లా, అరకు ఏజెన్సీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండగా.. శ్రీకాకుళం, అనకాపల్లి, కర్నూల్‌ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతోతో ఈదురు గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అవసరమైతే ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది.

Tags:
Next Story
Share it