Mahabubabad: ఆరూరి రేమేష్ కోసం రాజస్థాన్ సీఎం ప్రచారం

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ కు మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు.

Mahabubabad: ఆరూరి రేమేష్ కోసం రాజస్థాన్ సీఎం ప్రచారం
X

న్యూస్ లైన్ డెస్క్: మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలో బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి(Palakurhti) జనసభకు రాజస్థాన్(Rajasthan) ముఖ్యమంత్రి భజన్‌ లాల్ శర్మ(Bhajanlal sharma) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్(Aruri Ramesh)కు మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్‌ను ఆశీర్వదించాలని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)కి కానుకగా పంపాలని సూచించారు. దేశ ప్రజలందరూ కూడా మోడీ నాయకత్వాన్ని కొరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్(Congress) అబద్దపు హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దని భజన్‌ లాల్ శర్మ వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it