Rajasthan: పెళ్లిలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి

మేనల్లుడి పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండె ఆగి మృతి చెందిన మామ. ఈ ఘటన రాజస్థాన్‌లో (rajasthan) చోటుచేసుకుంది.

Rajasthan: పెళ్లిలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: మేనల్లుడి పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండె ఆగి మృతి చెందిన మామ. ఈ ఘటన రాజస్థాన్‌లో (rajasthan) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేనల్లుడి పెళ్లిలో మామ కమలేశ్ (kamalesh) అనే వ్యక్తి సంప్రదాయబద్ధంగా తలపై కుండ పెట్టుకుని డీజే పాటలకు (dj songs) మట్కా డ్యాన్స్ (matka dance) చేస్తున్నాడు. అతడితో పాటు చాలా మంది సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తున్న అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి బంధువులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కమలేశ్ గుండె ఆగిపోవడం వల్లే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.

Tags:
Next Story
Share it