IPL: సంజు శాంసన్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ విక్టరీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ లో భాగంగా శనివారం సాయత్రం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ కొట్టింది.

IPL: సంజు శాంసన్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ విక్టరీ..!
X

ధ్రువ్ జురెల్ సెల్యూట్ బ్యాటింగ్

కెప్టెన్ కేఎల్ రాహుల్ కు నిరాశ

జోస్ బట్లర్ ఊచకోత

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ లో భాగంగా శనివారం సాయత్రం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ కొట్టింది. ఆర్ ఆర్ బ్యాటర్స్ సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ అర్థం సెంచరీతో చెలరేగగా.. జోస్ బట్లర్ ఊచకోత చూపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. క్వింటన్ డికాక్(8) ను ట్రెంట్ బౌల్ట్ ఓవర్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ మంచి బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆర్ ఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రాహుల్ ( 48 బంతుల్లో 76 రన్స్ 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సహాయతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే లాస్ట్ మ్యాచ్ లో హీరో మార్కస్ స్టోయినిస్ ను సందీప్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్టోయినిస్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. లక్నో జట్టు 2 వికెట్లు కోల్పోయి 60 రన్స్ చేసింది. ఆ తర్వాత క్రీజులో దీపక్ హోడా దిగాడు. రాహుల్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. రాజస్థాన్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదాడు. కాగా, హోడా( 31 బంతుల్లో 50 పరుగులు 7 ఫోర్లు ) అర్థం సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోడి లక్నో స్కోర్ బోర్డుకు 70 పరుగులు జత చేశారు. కానీ హోడా(50), రవిచంద్రన్ అశ్విన్ ఓవర్ లో వెనుదిరిగాడు. ఆ కాసేపటికే రాహుల్(76) కూడా ఔట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్(11), ఆయుష్ బాదోని (18), కృనల్ పాండ్య పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాగా.. ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.

స్వల్ప లక్ష్యాన్ని చేదించేందుకు బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు మంచి స్టార్ట్ ని అందించార. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ దూకుడు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి కలిసి ఆర్ ఆర్ స్కోర్ బోర్డుకు 70 రన్స్ జోడించారు. అయితే యాష్ ఠాకూర్ ఓవర్ లో బట్లర్(34) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జైస్వాల్(24) మార్కస్ స్టోయినిస్ ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించి రవి బిష్ణయ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 70 రన్స్ కొట్టింది. ఆ తర్వాత క్రీజులో కెప్టెన్ సంజు శాంసన్ దిగాడు. సంజు హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో శాంసన్ ( అర్థం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక సంజు(71), జురెల్(54) ఆఖరి వరకు ఉండి రాజస్థాన్ రాయల్స్ కు విజయం అందించారు. దీంతో రాజస్థాన్ లక్నో జట్టును చిత్తుగా ఓడించింది. ఆర్ ఆర్, లక్నో సూపర్ జేయింట్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో బౌలర్లు మార్కస్ స్టోయినిస్, యాష్ ఠాకూర్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు.

Tags:
Next Story
Share it