Revanth Reddy: ఓటుకు నోటు కేసు నాకు మెడల్ లాంటిది..! (వీడియో)

నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనయని సామెత. రేవంత్ తీరు కూడా కాంగ్రెస్‌కు ఇపుడు అలాగే మారింది. పీసీసీ చీఫ్ హోదాలో తెలంగాణ సమాజాన్ని పదే పదే గాయపరుస్తున్నాడు.

Revanth Reddy: ఓటుకు నోటు కేసు నాకు మెడల్ లాంటిది..! (వీడియో)
X

ఇండియా టుడే రౌండ్ టేబుల‌్‌లో రేవంత్ వ్యాఖ్యలు

కేసులు అలంకారమా ?

తెలంగాణకు రేవంత్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ?

అమరావతి తరహాలో రాచకొండలో కొత్త సిటీ నిర్మిస్తాం

గ్రాఫిక్ సిటీనా ? హైదరాబాద్ ఖ్యాతి సంగతేంటి ?

పదే పదే అవే మాటలు

తెలంగాణను కించపరుస్తూ వ్యాఖ్యలు

మూసీ పరివాహక ప్రాంతమంతా..

యువతకు కూరగాయలమ్మే ఉపాధి కల్పిస్తాం

మూడు షిఫ్టుల్లో పని దొరుకుతుంది

యువతను పదే పదే అవమానిస్తున్న రేవంత్

గతంలో ఓయూ విద్యార్థులపై చిల్లర కామెంట్లు

నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనయని సామెత. రేవంత్ రెడ్డి తీరు కూడా కాంగ్రెస్‌కు ఇపుడు అలాగే మారింది. పీసీసీ చీఫ్ హోదాలో కాంగ్రెస్ పార్టీకి బూస్టివ్వడం సంగతేమో గానీ ఆయన పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ యువతను గాయపరుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మరో సిటీని రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి నిర్మిస్తారట. మూసి పరివాహక ప్రాంతం వ్యాప్తంగా యువతకు మూడు షిఫ్టులల్లో కూరగాయలమ్ముకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తాడట. ఈ మాటలన్నది రేవంతే. ఇండియా టుడే రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా అన్ని పార్టీల నేతలతో మాట్లాడిస్తున్నారు. అందులో రేవంత్ చేసిన కామెంట్లు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓటుకు నోటు కేసులో బాజాప్తా దొరికిన నిందితుడు రేవంత్. కానీ "ఆ కేసు తనకు మెడల్ లాంటిది" అని సమాధానం చెప్పడం దేనికి సంకేతం ? తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ?

తెలంగాణం, పొలిటికల్ డెస్క్ (నవంబర్ 09) : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అమోఘం. ప్రజల గుండెల్లో ఆ పార్టీ స్థానం ఎప్పటికీ పదిలం. ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఎలాగైనా స్పందించొచ్చు. అది ఆ పార్టీ ప్రజాస్వామ్యం, సంప్రదాయం. కానీ అది ఉంది కదా అని ఏమైనా మాట్లాడేయొచ్చా ? పార్టీ ముఖ్యులు, పార్టీ కీలక హోదాలో ఉండే బాధ్యులు మాట్లాడే మాటలకు, చేసే పనులకు విలువ ఉండొద్దా ? ముఖ్యనేతలు మాట్లాడే మాటలు ఒక్కోసారి బ్యాక్ ఫైర్ అయితే... "అవి ఆయన వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు" అని చేతులు దులిపేసుకునే ఓ దిక్కుమాలిన అవకాశం ఎప్పుడూ రెడీ ఉంటుంది.

ఇపుడిదంతా ఎందుకంటే ? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ యువతను, తెలంగాణ సమాజాన్ని అవమాన పరుస్తూ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే రౌండ్ టేబుల్లో వరుసగా అన్ని పార్టీల నేతలు మాట్లాడుతున్నారు. వారి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు చేరవేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఆ షోలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అవేంటంటే..

ఓటుకు నోటు కేసు నాకు మెడల్ లాంటిది

2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే హోదాలో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ అనే ఎమ్మెల్సీకి రూ. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దానిపై ప్రశ్నించగా.. "ఓటుకు నోటు కేసు నాకు మెడల్ లాంటిది. 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. కానీ 2014లో రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాపై 200కు పైగా కేసులు పెట్టాడు. డబ్బులిస్తూ దొరికిన నాపై కేసులు పెట్టించి, జైలుకు పంపాడు. కానీ తీసుకున్న వ్యక్తికి మాత్రం ఆరుగురితో సెక్యూరిటీ పెట్టి కాపాడాడు. నా కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడలేడు. నా పేరెత్తే దమ్ము కేసీఆర్‌కు లేదు" అంటూ బుకాయించాడు. రాజకీయాల్లో కక్ష్యా రాజకీయాలు కామనే. కేసీఆర్ ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు గాక. కానీ ఓటుకు నోటు కేసు వేరు. బ్రైబ్ ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన నిందితుడు ఆ కేసు నాకు మెడల్ లాంటిది అంటే తెలంగాణ సమాజం ఏమని అర్థం చేసుకోవాలి ? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ ఏం సందేశం ఇస్తున్నట్టు ? కేసులు అలంకారమా ? రేపు అధికారంలోకొస్తే నిందితులు రాజ్యమేలాలా ?

రాచకొండలో ల్యాండ్ పూలింగ్, మరో సిటీని నిర్మిస్తాం

మరో ప్రశ్నకు సమాధానంగా రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేసి అమరావతి తరహాలో హైదరాబాద్ కు ధీటుగా మరో సిటీని నిర్మిస్తామన్నాడు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు, హైదరాబాద్ జంటనగరాలకు అనుబంధంగా మరో నగరాన్ని నిర్మించడం అనేది ఎవరూ అడ్డు చెప్పరు. కానీ రేవంత్ రెడ్డి కోణం వేరే అన్నది ప్రత్యర్థుల ఆరోపణ. రాచకొండ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందాలకు తెరతీస్తామని, ఇప్పటికే ఎన్నికల సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించారన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. దీంతో రేవంత్ మాటలపై వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. పైగా అమరావతి తరహాలో కొత్త నగరాన్ని నిర్మిస్తామనడం ఆంధ్రా పెట్టుబడిదారులకు ఆవాసంగా మారుస్తారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో చంద్రబాబు చేసిన ల్యాండ్ పూలింగ్, కట్టిన కట్టడాలు, గ్రాఫిక్ డిజైన్లపై ఎంత పెద్ద దుమారం రేగిందో, ఆ కేసులు కోర్టుల్లో ఎలా నలుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. పోయి పోయి అమరావతితో పోలిక ఏంటన్నది తెలంగాణ ప్రజలకు అంతుబట్టని రహస్యంలా మారింది. పైగా హైదరాబాద్ అభివృద్ధికి నిధులు అవసరం లేదనడం దేనికి సంకేతం ? అసలు రేవంత్ తెలంగాణ వాడేనా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యువతతో కూరగాయలు అమ్మిస్తాం

అధికారంలోకి వస్తే మీ విజన్ ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా.. మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆ ప్రాంతమంతా టూరిస్ట్ స్పాట్లుగా మారుస్తాం. ఆ ఏరియాల్లో యువత మూడు షిఫ్టుల్లో "కూరగాయలు అమ్మడం" లాంటి అవకాశాలు కల్పించి ఉపాధి ఏర్పాట్లు చేస్తాం అని సమాధానమిచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్పీపై, కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించమంటే గొర్లు, బర్లు ఇస్తూ ఉపాధికి దూరం చేస్తోందని. అదే రేవంత్ రెడ్డి ఉద్యోగాల ఊసెత్తకుండా ఉపాధి పేరుతో కూరగాయలు అమ్మిస్తాం అనడం దేనికి సంకేతం ? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ? ఉద్యోగాలివ్వలేమని చెప్పినట్టు కాదా ?

టికెట్ల అమ్మకంపై

తాను పీసీసీ అధ్యక్షుడు అయ్యే నాటికి కాంగ్రెస్ లో అభ్యర్థులు కరువుండేది. అలాంటి పార్టీకి తాను సేవ చేయడం వల్ల పీసీసీ అధ్యక్షుడిని అవడం వల్ల టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. బ్లాక్ మార్కెట్ లాగా కాంగ్రెస్ వర్ధిల్లుతోంది. టికెట్ కోసం ఎంతైనా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. దాన్ని ప్రతిపక్షాలు టికెట్లు అమ్ముకుంటుండు అని విమర్శలు చేస్తున్నారు. కానీ తన ఆధ్వర్యంలో పార్టీ ఏ స్థాయికి ఎదిగిందో చూడాలన్నారు.

కామారెడ్డిలో గెలుస్తారా ?

కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేయడంపైనా రేవంత్ రెడ్డి స్పదించారు. కేసీఆర్‌ను ఓడిస్తారా అన్న ప్రశ్నకు అది కామారెడ్డి ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నాడని, కామారెడ్డి ప్రజలు కేసీఆర్ భవిష్యత్తు నిర్ణయిస్తారని అన్నారు. నా కాన్ఫిడెన్స్ సంగతి పక్కనపెట్టండి. కేసీఆర్‌ను అక్కడి ప్రజలే ఓడిస్తారని, హైకమాండ్ ఆదేశించింది కాబట్టే కామారెడ్డి బరిలో నిల్చుంటున్నట్టు చెప్పారు.

Tags:
Next Story
Share it