BRS : కేటీఆర్ ర్యాలీలకు మస్త్ క్రేజ్

ఒకప్పుడు కేసీఆర్ ఒక సభ నిర్వహిస్తే చాలు గెలుపు ఖాయం అనుకునే వాళ్లు, ఇప్పుడు కేటీఆర్ కాసేపు తమ నియోజకవర్గంలో గడిపితే చాలు అంటున్నారట కారు పార్టీ నేతలు.

BRS : కేటీఆర్ ర్యాలీలకు మస్త్ క్రేజ్
X

బూస్ట్ ఇస్తోందంటున్న నేతలు

న్యూట్రల్‌ ఓటర్లలో కనిపిస్తున్న మార్పు

స్పీచ్‌కు అట్రాక్ట్ అవుతున్న యూత్

కేటీఆర్ ప్రచార శైలి, మాట తీరే కారణం

బీఆర్ఎస్ ప్రచారంలో సరొకత్త విప్లవం

కేటీఆర్ ర్యాలీ కోసం అభ్యర్థుల ఎదురుచూపు

తెలంగాణం, బ్యూరో(నవంబర్ 20) : భారత రాష్ట్ర సమితికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే. గులాబీ దళపతిగా, అపర చాణక్యుడిగా ఆయన చెప్పిందే వేదం. చూపిందే మార్గం. ఆయన మాటలు పేలే తూటాలు. ఆయన వ్యూహాలు పదునైన ఆయుధాలు. రోజుకు రెండు, మూడు ప్రజా ఆశీర్వాద సభలతో కేసీఆర్ దూసుకుపోతుంటే.. ర్యాలీలతో ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ ఒక సభ నిర్వహిస్తే చాలు గెలుపు ఖాయం అనుకునే వాళ్లు, ఇప్పుడు కేటీఆర్ కాసేపు తమ నియోజకవర్గంలో గడిపితే చాలు అంటున్నారట కారు పార్టీ నేతలు. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీకి కేటీఆర్ ర్యాలీలు సరికొత్త ఊపునిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. నిన్నటి మొన్నటి వరకు వివిధ పార్టీల వైపు మొగ్గు చూపిన జనాలు, ఇప్పుడు కేటీఆర్ రాకతో ‘మనసు మార్చుకున్నామని, బీఆర్ఎస్‌ వైపే ఉంటామని’ అంటున్నారట.

కేటీఆర్ స్పీచ్‌కు ఫిదా

కేటీఆర్ మాటలు సీఎం కేసీఆర్‌లా ముఖం మీద కొట్టినట్టుగా ఉండవు. చాలా పాలిష్డ్‌గా, పొలైట్‌గా ఓ సీఈవో తరహాలో ఉంటాయి. పారిశ్రామికవేత్తల నుంచి గ్రామీణ స్థాయి వరకు అందరితో చాలా కలుపుగోలుగా మాటలు కలిపేస్తారు ఆయన. మెన్స్ డే రోజు మహిళలతో జరిపిన విమెన్ ఆస్క్ కేటీఆర్ సమావేశంలో ఆయన మాటలు వింటే ఇంకా క్లారిటీగా అర్థమవుంది. ఆధునికభావాలు, సంస్కారంతో కూడిన విలువలు ఇలా చాలా అంశాలలో నేటితరం నాయకులకు ఆయన మార్గదర్శనం అవుతారడనంలో అతిశయోక్తి లేదు. కచ్చితంగా ఆయనదో స్టైలే అని చెప్పాలి. ఇదే శైలితో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ర్యాలీలు సరికొత్త జోష్‌ను కార్యకర్తలు, అభిమానులలో నింపుతుంది. కేవలం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కాదు, ఆ పార్టీకి దూరంగా ఉండే జనం కూడా ఆయన కారణంగా దగ్గరవుతున్నారు.

బూతులు కాదు.. భవిష్యత్తుపై ఫోకస్

షాద్ నగర్, కొడంగల్, పరిగి, భద్రాచలం, నకిరేకల్, కూకట్ పల్లి ఇలా ఆయన వెళుతున్న ప్రతిచోటా మంచి స్పందన రావడం ఆ పార్టీ కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపుతుంది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల కంటే కేటీఆర్ ర్యాలీలు ఎఫెక్టీవ్‌గా ఉన్నాయని అంటున్నారు. ఆయన ట్రెండ్ సెట్ చేస్తున్నారని చెబుతున్నారు. కొత్త తరాన్ని పార్టీ వైపునకు తిప్పుకోవడంలో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అభాండాలు వేయకుండా, విద్వేషపు విషం చిమ్మకుండా, బూతులు మాట్లాడకుండా, చేసిన అభిృద్ధిని, వాస్తవాలను చెబుతూ ఆయన ర్యాలీలు సాగుతున్నాయి. ఈతరం నాయకుడు అన్న ఫీలింగ్ జనంలోకి తీసుకు వెళ్లేందుకు ఆయన చాలా ప్రయత్నిస్తున్నారు. గెలుపు కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, మీరు ఎంచుకోవలసింది, చూడాల్సింది రాష్ట్రానికి మేలు చేసేవారెవరో వారినే అంటూ ఆయన సూటిగా, సుత్తి లేకుండా చెబుతున్న మాటలు చాలా మందిపై ప్రభావం చూపిస్తున్నాయి.

కేటీఆర్ ప్రచార శైలి గత సంప్రదాయాలకు భిన్నంగా ఉంది. ఆయన విదేశాల్లో ఉండి రావడమో, లేక ట్రెండ్‌ను ఆయన ఫాలో అవుతుండటమో, ఏదైనా కారణం కావొచ్చు. సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటూ, డిజిటల్ ఇన్ఫ్లూయర్స్‌తో పార్టీని జనంలోకి తీసుకు వెళుతూ, ఇంటర్వ్యూలు ఇస్తూ, ఆర్జేలతో, వీజేలతో, యూట్యూబర్స్‌తో మాటలు కలుపుతూ, హోటల్స్‌లో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడాలు.. ఇలా అందరితో మమేకం అవుతూ, తనేంటో జనాలకు చెబుతూ, వాళ్ల నుంచి తెలుసుకుంటూ ఓ కొత్త ఒరవడిని రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెడుతున్నారు ఆయన. ఒకరకంగా చెప్పాలంటే ఇది తెలుగు రాజకీయాల్లో ఓ సరికొత్త విప్లవం. ప్రచారం అంటే ఇలాగే చేయాలన్న సంప్రదాయ గోడలను బద్దలుకొడుతూ కేటీఆర్ ఓ దారిని రాబోయే తరాలకు చూపిస్తున్నారు.

Tags:
Next Story
Share it