Good news: టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్ధులకు గుడ్ న్యూస్...!

రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్ధులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది

Good news: టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్ధులకు గుడ్ న్యూస్...!
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్ధులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా అమల్లో ఉన్న నిమిషం నిబంధనను సవరించాలని నిర్ణయించింది. ఇటీవల కొద్ది ఆలస్యం కారణంగా అనేక మంది విద్యార్ధులు ఎగ్జామ్స్ రాయకుండా దూరమయ్యారు. మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఇంటర్ ఎగ్జామ్స్ నుంచి నిమిషం నిబంధనను ఎత్తివేసింది.

పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైంను కేటాయించింది. దీంతో విద్యార్ధులను పరీక్ష స్టార్ట్ అయిన 5 నిమిషాల వరకు ఎగ్జామ్ హాల్ లోకి అనుమతిస్తారు. రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30కు ఎగ్జామ్ ప్రారంభం అవుతోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రేస్‌టైమ్‌ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతి ఇస్తారు.

Tags:
Next Story
Share it