Free bus effect: సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు..!-Video

ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చోవడంతో ఈ తగాదా మొదలైంది.

Free bus effect: సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు..!-Video
X

న్యూస్ లైన్ డెస్క్: మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఏ ముహూర్తాన ఈ పథకాన్ని అమలు చేశారో కానీ, బస్సుల్లో రద్దీ పెరిగిపోయి సీట్లు దొరక్కపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే, కల్పించారు.. కనీసం బస్సుల సంఖ్య అయినా పెంచాల్సింది కాదా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, రద్దీ కారణంగా బస్సుల్లో సీట్లు దొరకడంలేదని పలు మార్లు ప్రయాణికులు ఘర్షణలకు దిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

మహబూబాబాద్(Mahaboobabad)-తొర్రూరు(Thorrur) నుంచి ఉప్పల్‌(Uppal)కు వస్తున్న ఆర్టీసీ(RTC) బస్సులో సీటు కోసం ప్రయాణికులు ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చోవడంతో ఈ తగాదా మొదలైంది. ఇక ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ కాస్తా..కాస్తా వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించకుండా జరిగిందంతా రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Tags:
Next Story
Share it