TSPSC: గ్రూప్ 2, 3 పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్ డేట్ వచ్చింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది.

TSPSC: గ్రూప్ 2, 3 పరీక్షల తేదీలు ఖరారు
X

న్యూస్ లైన్, డెస్క్ః తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్ డేట్ వ‌చ్చింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించి జూన్ 9వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపిన టీఎస్పీఎస్సీ తాజాగా గ్రూప్ -2, గ్రూప్ 3 రాత ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేసింది. గ్రూప్ 2 రాత‌ప‌రీక్ష‌ల‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో, గ్రూప్ 3 ప‌రీక్ష‌ల‌ను న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అలాగే అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది. గ్రూప్-1 కింద 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3 కింద 1388 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

Tags:
Next Story
Share it