UPSC Results: UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. UPSC సివిల్స్ ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. 2023లో విడుదల అయిన నోటిఫికేషన్‌కు యూపీఎస్సీ బోర్డు ఫలితాలను విడుదల చేసింది.

UPSC Results: UPSC సివిల్స్ ఫలితాలు విడుదల
X

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. UPSC సివిల్స్ ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. 2023లో విడుదల అయిన నోటిఫికేషన్‌కు యూపీఎస్సీ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1,016 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు విద్యార్థులకు ర్యాంకుల పంట పండింది. విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు సందించింది. రెండవ ర్యాంకు అనిమేశ్ ప్రధాన్‌కు దక్కింది. దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంక్ దక్కింది. ఇక నందల సాయికిరణ్ 27, మెరుగు కౌశిక్ 22, పింకీస్ ధీరజ్ రెడ్డి 173, అక్షమ్ దీపక్ 196, భాను శ్రీ 198, ప్రదీప్ రెడ్డి 382, వెంకటేష్ 467, పూలధనుష్ 480, కె.శ్రీనివాసులు 526, సాయితేజ 558, పీ.భార్గవ్ 590, అర్పిత 639, శామల 649, సాక్షికుమార్ 679, చౌహాన్ 703, జి.శ్వేత 711, ధనుంజమ్ కుమార్ 810, లక్ష్మీ భానోతు 828 ర్యాంకులు సాధించారు. కేంద్రం ఈ ఫలితాలను upsc.gov.in and upsconline.nic.in. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Tags:
Next Story
Share it