Assembly Session: చాలిక.. సెలవిక..

శ్వేతపత్రం ఓ విఫలయత్నం

Assembly Session: చాలిక.. సెలవిక..
X

రెండు రోజులకే తోకముడిచిన రాష్ట్ర సర్కార్

ప్రతీ రంగంపై శ్వేతపత్రాల విడుదలకు ప్లాన్

తొలుత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై వైట్ పేపర్

తప్పుల తడకగా శ్వేతపత్రం రూపొందించిన సర్కార్

పేజీ పేజీకి సంబంధం లేని లెక్కలతో అబాసుపాలు

వైట్ పేపర్ డొల్లతాన్ని ఎత్తిచూపిన ప్రతిపక్షాలు

లెక్కలతో ఇజ్జత్ తీసిన హరీశ్, అక్బరుద్దీన్

శ్వేతపత్రాన్ని తప్పుబట్టిన మిత్రపక్షమైన సీపీఐ

రెండో రోజూ విద్యుత్ శ్వేతపత్రంపైనా ఇదే తంతు

జగదీశ్, కేటీఆర్, హరీశ్, అక్బర్ నాన్ స్టాప్ బ్యాటింగ్

ఇవాళ ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్న సర్కార్

ప్రతిపక్షాల ఎదురుదాడితో తోకముడిచిన ప్రభుత్వం

సభ నిరవధిక వాయిదా వేసుకుని..

చేతులు దులుపుకున్న అధికార పక్షం

న్కూస్ లైన్ డెస్క్: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి. శ్వేతపత్రంతో గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపాలనుకున్న రేవంత్ సర్కార్ తనకు తానే సెల్ఫ్ గోల్ చేసుకుంది. తొలిరోజు ఆర్థికపరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం, మరుసటి రోజు విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది. రెండు ప్రయత్నాల్లోనూ ఎదురుదెబ్బలు తగలడంతో ఇక మూడో ప్రయత్నాన్ని విరమించుకుంది. విపక్షాల ధాటికి తోకముడిచినట్టైంది. ఇవాళ కూడా ఇరిగేషన్‌పై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా, అది వర్కవుట్ కాకపోగా, మిస్ ఫైర్ అవుతుందన్న ఆందోళనతో సభనే నిరవధిక వాయిదా వేసుకోవడం గమనార్హం.

Tags:
Next Story
Share it