Tadipatri : తాడిపత్రి లో జగన్ ప్రభంజనం..మండుటెండని కూడా లెక్క చెయ్యని జనం!

సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో ప్రభంజనం సృష్టించిన సీఎం జగన్, నిన్న మేనిఫెస్టో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా, మోసపూరిత హామీలు లేకుండా, కేవలం అమలు అయ్యే హామీలను మాత్రమే పొందుపర్చి నేటి నుండి జనాల్లో పర్యటనకి సిద్ధమయ్యారు.

Tadipatri : తాడిపత్రి లో జగన్ ప్రభంజనం..మండుటెండని కూడా లెక్క చెయ్యని జనం!
X

న్యూస్ లైన్, తాడిపత్రి: సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో ప్రభంజనం సృష్టించిన సీఎం జగన్, నిన్న మేనిఫెస్టో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా, మోసపూరిత హామీలు లేకుండా, కేవలం అమలు అయ్యే హామీలను మాత్రమే పొందుపర్చి నేటి నుండి జనాల్లో పర్యటనకి సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారాన్ని నేడు తాడిపత్రి తో మొదలు పెట్టిన సీఎం జగన్ కి అడుగడుగునా జనాలు బ్రహ్మరథం పట్టారు. మండుటెండలో జనాలు బయట తిరగడానికి కూడా భయపడుతున్న ఈ సమయం లో జగన్ కోసం వేలాది మంది గంటల తరబడి ఎండల్లో వేచి చూసారు. జగన్ ఎంతో ఉత్సాహం తో ప్రారంభించిన ప్రసంగానికి, వచ్చిన వేలాది మంది అభిమానులు కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయేలా చేసారు. ఈ ఒక్క సభతో తాడిపత్రి రాజకీయాల్లో మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు ఈ స్థానం తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ రాకతో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికలలో తాము అమలు చేసిన మేనిఫెస్టో గురించి గర్వంగా చెప్పుకుంటూ, 2014 ఎన్నికలలో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ని జనాలకు చూపిస్తూ ఇందులో ఒక్క హామీ అయినా నెరవేర్చారా వాళ్ళు అంటూ జగన్ జనాల్లోకి వెళ్లిన తీరుకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి దూకుడుతోనే ముందుకు పోతే కూటమికి 30 సీట్లు రావడం కూడా కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:
Next Story
Share it