Venkatagiri : తాగేసిన గ్లాస్ సింక్ లోనే ఉండాలి - సీఎం జగన్

సీఎం జగన్ తన మొదటి రోజు ఎన్నికల పర్యటన నేడు తాడిపత్రి నుండి ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. సిద్ధం సభలకు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో, అంతకు మించి జగన్ ఎన్నికల ప్రచారానికి రీసౌండ్ వచ్చే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

Venkatagiri : తాగేసిన గ్లాస్ సింక్ లోనే ఉండాలి - సీఎం జగన్
X

న్యూస్ లైన్, వెంకటగిరి: సీఎం జగన్ తన మొదటి రోజు ఎన్నికల పర్యటన నేడు తాడిపత్రి నుండి ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. సిద్ధం సభలకు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో, అంతకు మించి జగన్ ఎన్నికల ప్రచారానికి రీసౌండ్ వచ్చే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. సినిమా హీరోలకు జనాలు రావడం సర్వసాధారణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కి జనాలు వస్తారు కానీ ఓట్లు వెయ్యరు, అది కేవలం సినిమా జనాలు మాత్రమే. కానీ సీఎం జగన్ కి అడుగడుగునా జనాలు ఈ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన మీద జనాల్లో ఉన్న ప్రేమాభిమానాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే మేనిఫెస్టో విషయం లో చంద్రబాబు ఆకాశానికి మెట్లు వేస్తూ వెళ్తుంటే, సీఎం జగన్ మాత్రం కేవలం ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో ని మాత్రమే జనాల ముందు ఉంచి తన నిబద్దత, నిజాయితీని చాటుకున్న తీరుకి జనాల నుండి మంచి స్పందన లభించింది. ఇకపోతే నేడు ఆయన నేడు వేంకటగిరి లోని త్రిభువని సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఇచ్చిన మోసపూరిత మేనిఫెస్టో గురించి వివరిస్తూ కడిగిపారేశారు. అనంతరం ఆయన ఫ్యాన్ గుర్తు కి ఓటు వెయ్యమని చెప్తూ 'అక్క మన గుర్తు ఫ్యాను, ఆకు పచ్చ చీర కట్టుకున్న అవ్వా, ఇటు చూడు, మన గుర్తు ఫ్యాను. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి, తాగేసిన గ్లాసు సింకులో ఉండాలి' అంటూ జగన్ ఎంతో ఉత్సాహంగా ప్రసంగించారు.

Tags:
Next Story
Share it