Election commission : జనసేన పార్టీ కి శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం!

నసేన పార్టీ కి ఎన్నికల సంఘం కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ క్యాటగిరి లో ఇన్ని రోజులు ఉంచిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Election commission : జనసేన పార్టీ కి శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం!
X

న్యూస్ లైన్ డెస్క్: జనసేన పార్టీ కి ఎన్నికల సంఘం కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ క్యాటగిరి లో ఇన్ని రోజులు ఉంచిన సంగతి మన అందరికీ తెలిసిందే. అంటే జనసేన పార్టీ లేని చోట స్వతంత్ర అభ్యర్థి ఎవరైనా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చెయ్యొచ్చు అన్నమాట. ఇలా చేస్తే కూటమి ఓట్లు చీలిపోతాయి, తెలుగు దేశం పార్టీ అనేక స్థానాల్లో ఓడిపోయే ప్రమాదం ఉంది, ఇప్పుడెలా చెయ్యాలి అని జనసేన పార్టీ నాయకులూ, అభిమానులు కంగారు పడ్డారు. అలా కంగారు పడిన అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త. జనసేన పార్టీ కి గాజు గ్లాస్ గుర్తుని కామన్ సింబల్ గా కేటాయించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్నీ జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేసారు. అలాగే జై భారత్ నేషనల్ పార్టీ కి 'టార్చ్ లైట్' గుర్తుని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. టార్చ్ లైట్ గుర్తు తమిళనాడు లో కమల్ హాసన్ పార్టీ గుర్తుగా చలామణి అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Tags:
Next Story
Share it