Business:రూ:50వేల పెట్టుబడితో లక్షల్లో సంపాదన.!

ప్రస్తుత కాలంలో చాలామంది జాబ్స్ దొరకక ఏదైనా బిజినెస్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది జాబ్స్ చేసి విసుగుచేంది ఈ రంగంలోకి రావాలనుకుంటారు.

Business:రూ:50వేల పెట్టుబడితో లక్షల్లో సంపాదన.!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది జాబ్స్ దొరకక ఏదైనా బిజినెస్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది జాబ్స్ చేసి విసుగుచేంది ఈ రంగంలోకి రావాలనుకుంటారు. అయితే బిజినెస్ లో అడుగు పెట్టాలంటే పెద్దగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ బిజినెస్ మాత్రం కేవలం రూ:50వేల లోపు పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు. వర్క్ అవుట్ అయితే మాత్రం లక్షల్లో సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటయ్యా అంటే ఫుడ్ బిజినెస్. మరి పూర్తి వివరాలు చూద్దాం..

ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు విపరీతంగా సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ విపరీతంగా వైరల్ అయింది. ఈమె రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ పెట్టి లక్షల్లో సంపాదిస్తుంది. అయితే ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం జనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు ఎంచుకోవాలి. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా పెద్ద పెద్ద ఫుడ్ బిజినెస్ లు ఉన్నాయా లేదా అనేది కూడా గమనించాలి. అక్కడ ఏమీ లేకపోతే మీరు ఎంచక్కా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ బిజినెస్ రాత్రి సమయాల్లో చేస్తే ఇంకా బాగుంటుంది.

ప్రస్తుత కాలంలో చాలామంది రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఫుడ్ అందిస్తూ ఉంటారు. హైదరాబాద్ మినహా ఇక ఏ ప్రాంతాల్లో కూడా 24 అవర్స్ ఫుడ్ దొరకదు. కానీ మీరు చేసే బిజినెస్ రాత్రి సమయంలో పెట్టుకుంటే ఈజీగా సంపాదించవచ్చు. ముందుగా మీరు ఏదైనా స్నాక్స్ తో స్టార్ట్ చేయండి. అది వర్క్ అవుట్ అయితే బిర్యానీ పాయింట్లను కూడా ఏర్పాటు చేసుకొని సంపాదించుకోవచ్చు. మనం ఏదైనా టిఫిన్, స్నాక్స్ లాంటివి పెట్టాలంటే కేవలం రూ:50000 లోపు ఖర్చు చేస్తే చాలు. రోజు కనీసం 200 మంది కస్టమర్లు వచ్చినా కనీసం 4వేల రూపాయలు వస్తాయి. అంటే నెలకి తక్కువలో తక్కువ లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఇందులో అన్ని ఖర్చులు పోను మీకు సగం డబ్బులైన మిగులుతాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

Tags:
Next Story
Share it