MDH Everest : ఎండీఎచ్, ఎవరెస్ట్ మసాలా పై నిషేధం.. దర్యాప్తు షురూ

హాంకాంగ్ , సింగపూర్‌లలో ఎండీఎచ్, ఎవరెస్ట్ మసాలాలపై నిషేధం విధించారు.

MDH Everest : ఎండీఎచ్, ఎవరెస్ట్ మసాలా పై నిషేధం.. దర్యాప్తు షురూ
X

MDH Everest : హాంకాంగ్ , సింగపూర్‌లలో ఎండీఎచ్, ఎవరెస్ట్ మసాలాలపై నిషేధం విధించారు. తర్వాత ప్రస్తుతం భారతదేశంలో కూడా దీనిపై చర్చ ప్రారంభమైంది. భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (FSSAI) ఈ విషయంపై తాజాగా దర్యాప్తును ప్రారంభించింది. MDH , ఎవరెస్ట్ మసాలాలపై నిషేధం తర్వాత, FSSAI ఇప్పుడు భారతదేశంలో ఈ మసాలా దినుసుల కొత్త నమూనాలను పరీక్షించనుంది. ఇందుకోసం FSSAI కంపెనీకి చెందిన వివిధ తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తోంది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సంబంధించిన ప్రభుత్వ వర్గాలు తాము కేవలం ఎమ్‌డిహెచ్ , ఎవరెస్ట్ నుండి మసాలా శాంపిల్స్ సేకరించడం లేదని చెబుతున్నాయి. కొన్ని ఇతర మసాలా బ్రాండ్‌ల యూనిట్ల నుండి కూడా నమూనాలను సేకరిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు FSSAI తెలిపింది. మసాలాల్లో పురుగుమందుల ఉనికి కారణంగా ఎవరెస్ట్, MDH సుగంధ ద్రవ్యాలు నిషేధించబడ్డాయి. కానీ విచారణలో అలాంటి ఉన్నట్లు ప్రస్తుతానికైతే తేలలేదు. హాంకాంగ్, సింగపూర్ తమ పౌరులు MDH , ఎవరెస్ట్ కొన్ని మిశ్రమ సుగంధాలను ఉపయోగించకుండా నిషేధించాయి. హాంకాంగ్ , సింగపూర్‌లోని ఆహార భద్రతా విభాగం ఈ కంపెనీల కొన్ని మసాలా మిశ్రమాలలో పురుగుమందు, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు చెబుతోంది. సాధారణంగా ఈ పురుగుమందును ఫంగస్ నిరోధించడానికి ఉపయోగిస్తారు.

Tags:
Next Story
Share it