Gold Rates: బిగ్ రిలీఫ్..బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త

బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలోనే బంగారం చాలా విలువైనది. డబ్బు కంటే ఎక్కువగా బంగారాన్ని ప్రేమిస్తారు జనాలు. అయితే ఈ బంగారం మన దేశం

Gold Rates: బిగ్ రిలీఫ్..బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త
X

Gold Rates: బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలోనే బంగారం చాలా విలువైనది. డబ్బు కంటే ఎక్కువగా బంగారాన్ని ప్రేమిస్తారు జనాలు. అయితే ఈ బంగారం మన దేశంలో విపరీతంగా ధర పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తులం బంగారం ధర 75 వేల రూపాయల వరకు చేరుకుంది. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ కాస్త బంగారం ధరలు తగ్గాయి.

హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం అలాగే వెండి ధరల వివరాల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి 74,230 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి... 68, 040 రూపాయలుగా నమోదు అయింది. అటు వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధర ₹100 తగ్గి 86,400 రూపాయలుగా నమోదు అయింది.

Tags:
Next Story
Share it