ECIL JOBS:రూ:1లక్ష60 వేల జీతంతో జాబ్స్..!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో ఉద్యోగాల

ECIL JOBS:రూ:1లక్ష60 వేల జీతంతో జాబ్స్..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు వారి కేడర్ ను బట్టి జీతభత్యాలు ఉంటాయి.

రిక్రూట్మెంట్ కి ఎంపికైనటువంటి వారు ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో డిప్యూటీ మేనేజర్ గా పనిచేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మార్చి 23 తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవ్వబోతోంది. ఈ తేదీని ఏప్రిల్ 13కు చివరి తేదీగా ప్రకటించారు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు 32 ఏళ్ళు ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పీజీ ఉత్తీర్ణత, ఇంజనీరింగ్ చదివి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ:50 వేల నుంచి రూ:1,60,000 వరకు జీతం ఉంటుంది.

ఇక దీన్ని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే రూ:వేయి రూపాయలు చెల్లించాలి. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 23, 2024న స్టార్ట్ అవ్వగా ఏప్రిల్ 13, 2024న ముగుస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి ఫామ్ ను డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈసీఐఎల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, హైదరాబాద్ -500062 అనే చిరునామాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2024 హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీగా ఉంది. వారి యొక్క విద్యార్హత పని అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Tags:
Next Story
Share it